టీమిండియా ప్లేయర్లతో ఓ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అవయవ అవయవ దానం చేయాలంటూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే టీమిండియా క్రికెటర్లతో.. ఓ వీడియో చేయించి అవయవ దానం చేయాలంటూ పిలుపునిచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా క్రికెటర్లతో వీడియో చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. ఈనెల 12వ తేదీన అహ్మదాబాద్ లోని.. నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున అవయవ దానం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది బీసీసీఐ.
అవయవ దానం చేయండి ప్రాణాలను కాపాడండి అనే థీమ్ తో మూడో వన్డేలో ప్రత్యేక కార్యక్రమాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి చేపట్టబోతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని టీమిండియా ప్లేయర్లతో వీడియో ద్వారా చెప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశవ్యాప్తంగా అవయవ దానం చేసేవారు కరువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ అవయవ దానం కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే టీమిండియా ప్లేయర్ల ద్వారా పిలుపునివ్వడం గొప్ప కార్యక్రమం. కచ్చితంగా టీమిండియా ప్లేయర్లు పిలుపునిస్తే చాలామంది ఫాన్స్ రియాక్ట్ అవుతారు. అందుకే ఈ రూట్ ఎంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇకనైనా అవయవ దానం చేసేవారు ముందుకు వస్తే ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడే ఛాన్స్ ఉంటుంది. మరి టీమిండియా ప్లేయర్ల పిలుపు మేరకు ఎంతమంది అవయవ దానం కోసం ముందుకు వస్తారో చూడాలి.
Pledge to donate your organs and make a difference!#TeamIndia | #DonateOrgansSaveLives | #INDvENG pic.twitter.com/NiG0YRE773
— BCCI (@BCCI) February 10, 2025
![]() |
![]() |