ఈమధ్య కాలంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడే అమాయక మహిళలను బలాత్కరిస్తూ.. కాసేపటి సుఖం కోసం వాళ్ల జీవితాలనే పాడు చేస్తున్నారు. తాజాగా ఇలాగే చేశాడో ప్రైవేట్ బస్సు డ్రైవర్. తన బస్సులో ఎక్కిన మహిళా ప్రయాణాకురాలిని క్షేమంగా గమ్యస్థానంలో దింపకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇందుకు కాపలాగా బస్సు కండక్టర్‌ను పెట్టగా అతడు కూడా సాయం చేశాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
హర్యానాలోని ఫరీదాబాద్‌కి చెందిన 56 ఏళ్ల మహిళ.. పలు ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 9వ రోజు కూడా పనికి వెళ్లింది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకోవడానికి సెక్టార్ 17లోని బైపాస్ రోడ్డులో నిలబడి ఉంది. అక్కడే సాయంత్రం 6 గంటలకు ఓ ప్రైవేటు బస్సు రాగా.. ఆ బస్సు ఎక్కింది. అయితే అందులో ఎవరూ లేరు. ఈమె ఒక్కతే కాగా.. బస్సు డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. ఈక్రమంలోనే ఆమె వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో తీసుకెళ్లాడు.
నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే బస్సు ఆపి లోపలికి వచ్చాడు. కండక్టర్ అలాగే చూస్తుండగా.. ఏమైందో అర్థం కాని మహిళ బస్సు ఎందుకు ఆపారంటూ అడుగుతోంది. కానీ అతడు మాత్రం సమాధానం చెప్పకుండానే.. నేరుగా వెళ్లి ఆమెపై పడ్డాడు. అలాగే చూస్తున్న కండక్టర్‌కు బస్సులోకి ఎవరూ రాకుండా చూడమని చెప్పాడు. బయట ఎవరైనా కనిపించినా వెంటనే చెప్పాలని అన్నాడు. ఇందుకు కండక్టర్ కూడా ఒప్పుకోగా.. సదరు డ్రైవర్ దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కోరిక తీరాక అదే బస్సులో మహిళను తీసుకుని ఓ రోడ్డు వద్ద దింపేశాడు. దారుణంగా అత్యాచారానికి గురైన మహిళ నేరుగా ఇంటికి వెళ్లకుండా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే ఆమెను దింపిన చోటుకు వెళ్లగా అక్కడే బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు డ్రైవర్ 35 ఏళ్ల రోషన్ లాల్, కండక్టర్ నాన్హేలు బదౌన్‌లోని హర్థత్తాపూర్ గ్రామానికి చెందినవారు.
రోషన్ మూడు నెలలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నప్పటికీ.. నాన్హే ఆరు వారాల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు చెప్పారు. వీరి విచారణ తర్వాత నిందితులను స్థానిక కోర్టు ముందు హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే నేరానికి ఉపయోగించిన బస్సును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![]() |
![]() |