టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు వేతన పెంపుకు సంబంధించిన లేఖలను కూడా జారీ చేసినట్లు సమాచారం. అర్హులైన ఉద్యోగులకు సగటున 5 శాతం నుంచి 8 శాతం, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం మేర వేతనాలు పెంచినట్లుగా సమాచారం.ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం, అంచనాలకు మించి కనబరిచిన వారికి 7 నుంచి 10 శాతం, అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతన పెంపును అందించినట్లుగా సమాచారం. జనవరి 1వ తేదీ నుంచి ఈ వేతన పెంపు వర్తిస్తుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa