రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి అధికారికంగా టీజ్ చేసింది.ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఇక లీక్ అయినా వివరాలను బట్టి చూస్తే.. ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుందని రియల్‌మి షేర్ చేసిన ఫోటోల్లో వెల్లడైంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ ఆప్షన్‌లో లభించనున్న ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది.ఇక ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉండి, 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు అంచనా. ఇక ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రానుంది. దీని వల్ల వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి పనుల్లో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వంటి వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS ఆధారంగా పనిచేస్తూ.. 6000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో దీర్ఘకాలం బ్యాకప్ అందించనుంది. ఈ డివైస్ IP69 రేటింగ్‌తో వస్తోంది. అంటే ఇది దుమ్ము, ధూళి, నీరు వాటి నుండి రెసిస్టెంట్ గా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ కు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించబడింది.
![]() |
![]() |