వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మేలు చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వసతి దీవెన మొదలుపెట్టారని ఎమ్మెల్యే వరుదు కళ్యాణి తెలిపారు. వైయస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారని, దీంతో కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఉండేదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన రూ.1778 కోట్ల బకాయిలను వైయస్ జగన్ చెల్లించారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయమన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |