హిందూజా గ్రూప్ యొక్క భారతీయ ప్రతిష్టాత్మక సంస్థ మరియు ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారు అశోక్ లేలాండ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో తమ కొత్త బస్సు తయారీ కేంద్రంను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా, అశోక్ లేలాండ్ మరియు హిందూజా గ్రూప్ లు స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు యొక్క తాళం చెవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు, దీనిని మంత్రి శ్రీ నారా లోకేష్ అందుకున్నారు, ఇది రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి వారి ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక.
![]() |
![]() |