ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చామని లోకేశ్ గుర్తుచేశారు. ‘రాష్ర్టానికి కొత్త పెట్టుబడుదారులను ఆహ్వానించే ముందు వారిలో విశ్వాసాన్ని కలిగించే చర్యలు చేపడుతున్నాం. ఈ ప్లాంట్ అశోక్ లేల్యాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. కేటాయించిన 75 ఎకరాల్లో మొదటి ఫేజులో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్థి చేశారు. ఈ ప్లాంట్‌కు ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొదటిదశలో 600 ఉద్యోగాలు వచ్చాయి. రెండో దశలో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలలో విశ్వాసాన్ని పునరుద్థరించడంపై దృష్టి సారించాం. ఫలితంగా ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు రూ.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పైన, మా ప్రభుత్వ నాయకత్వంపైనా నమ్మకం ఉంచినందుకు అశోక్ లేల్యాండ్, హిందూజా గ్రూప్ అధినేతలు అశోక్ హిందూజా, ధీరజ్ హిందూజా, సోమ్ హిందూజా, షేను అగర్వాల్, గణేశ్ మణి, స్విచ్ మొబిలిటీకి చెందిన మహేష్ బాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇకపై పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎస్ర్కో ఎకౌంట్ ద్వారా నేరుగా జమ చేస్తాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఎండీ అభిషిక్త్, ఆర్‌టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ హిందూజా, ధీరజ్ హిందూజా, ఎండీ షేనూ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |