వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసింది. తాజాగా ముంబైలో పూర్తిస్థాయిలో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 2025 నెలలో ఢిల్లీ, బెంగళూర్, మైసూర్, పాట్నా, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో 5G లాంచ్ చేస్తామని Vi తెలిపింది. ఇప్పటికే దేశంలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రారంభ ఆఫర్ లో భాగంగా రూ.299 మరియు అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌లపైన అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఏప్రిల్ లో కొన్ని ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుండగా.. మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. Vi నెట్‌వర్క్ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం భారీగా నిధులు సమకూర్చుకుంటుంది. 4G, 5G నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5G నెట్‌వర్క్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రేస్‌లో Vi వెనకబడింది. ఈ కారణంగా అనేక మంది యూజర్లు ఆయా నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అయ్యారు.
![]() |
![]() |