నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లు చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగించనున్నారు. ఈ క్రమంలో ఆ నెంబర్లకు ఏప్రిల్ 1, 2025 నుంచి ఫోన్‌పే,పేటీఎం, గూగుల్ పే సేవలు నిలిపేయనున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI పేర్కొంది.సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని ఎన్‌పీసీఐ ఎత్తిచూపింది. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే.. అది మోసానికి దారితీస్తుంది.
![]() |
![]() |