ఒప్పో నుంచి కొత్త 5G సిరీస్ లాంచ్ అయింది. ఇందులో ఒప్పో F29 5G, ఒప్పో F29 5G ప్రో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ ఫోన్‌లు మిలిటరీ గ్రేడ్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ను సపోర్టు చేస్తాయని ఒప్పో వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1080*2412 పిక్సల్స్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది. 45W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఒప్పో F29 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. EIS (ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్ JN5 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
ప్రైమరీ కెమెరా AI లైవ్‌ఫోటో, AI అన్‌బ్లర్, AI Eraser 2.0 వంటి ఫీచర్‌లు సహా అండర్ వాటర్ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది. 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెనా ను వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా మెరుగైన సిగ్నల్ ను పొందవచ్చు. ప్రో మోడల్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ (1080*2412 పిక్సల్స్) డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది. ఈ మోడల్స్ 27 మర్చి న మార్కెట్ లోకి రానున్నాయి.
The wait is over! Pre-order the all-new #OPPOF29Series5G – starting at ₹23,999! Featuring the stunning OPPO Glow design and a tough 360° Armor Body, this smartphone is made to shine and endure.#TheDurableChampion
Pre-order now: https://t.co/I4uZbocao7 pic.twitter.com/oVea3r3ocV
— OPPO India (@OPPOIndia) March 20, 2025
![]() |
![]() |