తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో బ్యారీ, బ్యాక్ ప్యానల్ డిజైన్, కెమెరా మాడ్యూల్ డిజైన్ సహా ఇతర వివరాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా ఐకూ వెల్లడించింది. నియో 10R స్మార్ట్‌ఫోన్‌లో భారీ బ్యాటరీని అందించిన ఐకూ.. మరింత భారీ బ్యాటరీతో ఐకూ Z10 5G ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా అందించిన వివరాల ఆధారంగా ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీతో ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ చేస్తామని తెలిపారు. ఫలితంగా ఈ ఫోన్ అనేక మందిని ఆకట్టుకొనే ఆవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ టీజర్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ వెనుక వైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.
![]() |
![]() |