ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధుమేహ చికిత్స కోసం జెనియా..

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 09:34 PM

టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో గ్లైసెమిక్ నియంత్రణ, గుండె వైఫల్యం మరియు దీర్ఘకాలిక మూత్రపిండ సంరక్షణ కోసం సుప్రసిద్ధ  ఎస్‌జిఎల్‌టి 2 ఇన్హిబిటార్  అయిన జెనియా (ఎంపాగ్లిఫ్లోజిన్    మరియు దాని కలయికలు) ను భారతీయ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ USV విడుదల చేసింది. ఈ విడుదల రూ. 1,100 కోట్ల ఎస్‌జిఎల్‌టి 2 ఐ మార్కెట్లో యుఎస్‌వి ఉనికిని మరింతగా బలోపేతం చేస్తుంది. నోటి ద్వారా తీసుకునే మధుమేహ చికిత్స ఔషధాలలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. జెనియా  (ఎంపాగ్లిఫ్లోజిన్10 ఎంజి & 25 ఎంజి ), జెనియా ఎం (ఎంపాగ్లిఫ్లోజిన్12.5  ఎంజి + మెటాఫార్మిన్  500 ఎంజి ఐఆర్‌ R / 1000 ఎంజి ఈఆర్‌ ), మరియు జెనియా ఎస్‌ టి  (ఎంపాగ్లిఫ్లోజిన్ 25 ఎంజి  + సిటాగ్లిప్టిన్  100 ఎంజి ) ను  యుఎస్‌ వి  పరిచయం చేసింది.


ఈ ఆవిష్కరణ  గురించి  యుఎస్‌వి మేనేజింగ్ డైరెక్టర్ప్ర శాంత్ తివారీ మాట్లాడుతూ  "భారతదేశంలో 101 మిలియన్లకు పైగా టైప్ 2 డయాబెటిస్ , 136 మిలియన్ల మంది ప్రీడయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్నారు. జెనియాతో, మేము ఈ విభాగంలో మా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఆధునిక డయాబెటిస్ సంరక్షణకు అవకాశాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మెరుగైన రోగి ఫలితాల కోసం సరసమైన, అధిక-నాణ్యత చికిత్సలను అందించడానికి యుఎస్‌వి కట్టుబడి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com