బ్రాండ్ యొక్క మహోన్నతమైన 140 సంవత్సరాల చరిత్ర లో ప్రత్యేకంగా సేకరించిన అత్యంత ముఖ్యమైన టైమ్‌పీస్‌ల ప్రదర్శన గా నిలువనున్న బ్రెయిట్లింగ్ హెరిటేజ్ ఎగ్జిబిషన్. ఈ ప్రదర్శనను నాలుగు ఖండాలలో 55 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది.1884లో కార్యకలాపాలు ప్రారంభించిన బ్రెయిట్లింగ్ , 140 సంవత్సరాలుగా వాచ్ తయారీ ఆవిష్కరణలలో ముందంజలో ఉంది. ఆధునిక క్రోనోగ్రాఫ్, వృత్తాకార స్లయిడ్ నియమంతో తీర్చిదిద్దిన మొదటి పైలట్ వాచ్ సహా ఎన్నో ఆవిష్కరణలను చేసిన బ్రెయిట్లింగ్ , 100% సిఓసిఎస్ సర్టిఫికేట్ పొందిన మొదటి సంస్థగా కూడా గుర్తింపు పొందింది.బ్రెయిట్లింగ్ తన వార్షికోత్సవం ను "140 సంవత్సరాల ప్రథమాలు" అనే ట్యాగ్‌లైన్‌తో వేడుక జరుపుకుంటోంది. దీనిలో భాగంగా తమ కొత్త ప్రదర్శనలో ఈ విప్లవాత్మక వాచ్ లను చూసే అవకాశం కల్పిస్తుంది. "మా వారసత్వాన్ని గౌరవించడానికి మరియు మా పురోగతులను వేడుక జరుపుకోవడానికి మేము టైమ్ క్యాప్సూల్‌ను ప్రారంభించాము" అని బ్రెయిట్లింగ్ సీఈఓ జార్జెస్ కెర్న్ అన్నారు. "ప్రతి ప్రదర్శన మన వారసత్వాన్ని వర్తమానంతో అనుసంధానించే ఆకర్షణీయమైన ప్రయాణం, అతిథులు మా బ్రాండ్ యొక్క పరిణామం మరియు శాశ్వత స్ఫూర్తిని చూడటానికి వీలు కల్పిస్తుంది" అని అన్నారు.
"బ్రెయిట్లింగ్ టైమ్ కాప్సూల్ ఎగ్జిబిషన్ అనేది వారసత్వం, ఆవిష్కరణ మరియు ఖచ్చితత్వానికి నివాళి. గర్వించదగిన రిటైల్ భాగస్వామిగా, ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని హైదరాబాద్‌లోని బ్రెయిట్లింగ్ బోటిక్‌కు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. వాచ్ సేకరణ దారులు , వాచ్ ప్రియులకు బ్రెయిట్లింగ్ యొక్క అత్యంత ప్రసిద్ధ టైమ్‌పీస్‌లను అన్వేషించడానికి అవకాశాన్ని అందిస్తున్నాము" అని కమల్ వాచ్ కంపెనీ డైరెక్టర్ నీరజ్ తోట్ల అన్నారు.
![]() |
![]() |