ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తన ప్రీమియం మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో ఏస్ ఫీచర్‌ను తీసుకువచ్చింది, ఇది పెట్టుబడిదారులుకు తగిన సమాచారంతో, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పించే సంబంధిత పరిజ్ఞానము మరియు సాధనాలను అందిస్తుంది. ఈ ఫీచర్ డిజిటల్‌గా 'డూ-ఇట్-యువర్ సెల్ఫ్ ' పెట్టుబడితో ఒక వ్యక్తిని శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ యాప్‌లోని ఏస్ ఫీచర్ భారతదేశంలోని 2500 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్‌లపై గొప్ప మరియు ఉపయోగకరమైన వివరాలను అందిస్తుంది. పెట్టుబడిదారులు వివిధ ఫండ్ విభాగాలను (ఈక్విటీ, డెట్, టాక్స్-సేవింగ్, హైబ్రిడ్ మరియు ఇండెక్స్ ఫండ్‌లు వంటివి) బ్రౌజ్ చేయవచ్చు , వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించడానికి సరైన అవసర-ఆధారిత నిధిని ఎంచుకోవచ్చు.
![]() |
![]() |