ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోతోంది. గతేడాది పరుగుల వరద పారించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారించింది. ఎప్పటిలానే విధ్వంసకర ఓపెనర్లు ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించారు. దీంతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడగా.. రాయల్స్ బౌలర్లకు బంతులెక్కడేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎందరు బౌలర్లను మార్చినా ఫలితం మారలేదు. ప్రతి ఒక్కరూ రైజర్స్ బ్యాటర్లకు బాధితులుగానే మారారు. ఈ క్రమంలోనే హెడ్ ఒక ఓవర్లో జోఫ్రా ఆర్చర్‌కు చుక్కలు చూపించాడు.
అప్పటికే తొలి 4 ఓవర్లలో 10కిపైగానే పరుగుల చొప్పున రైజర్స్ బ్యాటర్లు పిండుకోగా.. ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ను హెడ్ ఉతికారేసాడు. తొలి బంతిని బౌండరీకి తరలించగా.. రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇది 105 మీటర్ల దూరం వెళ్లడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మూడో బంతి డాట్ చేయగా.. నాలుగో బంతి కూడా ఫోర్ వెళ్లింది. 5, 6 బంతుల్ని కూడా బౌండరీకి తరలించగా.. వైడ్ కలిపి మొత్తం ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి.
ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన ఓపెనర్ అభిషేక్ శర్మ 15 బంతుల్లో 24 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తొలి వికెట్‌కు హెడ్, అభిషేక్ కలిసి 3.1 ఓవర్లలోనే 45 రన్స్ జోడించారు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఫోర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లేలో సన్ రైజర్స్ ఒక వికెట్ కోల్పోయి 94 రన్స్ చేసింది. హెడ్ ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అధిగమించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ పదో ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో హెట్మయర్ క్యాచ్‌చో హెడ్ అవుటయ్యాడు. 31 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 9.3 ఓవర్లలో 130 గా ఉంది. ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి జతయ్యాడు.
ఇక ఎప్పట్లాగే హైదరాబాద్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో ఆ టీమ్ ఓనర్ కావ్యమారన్ సందడి చేసింది. హెడ్, ఇషాన్ కిషన్ ఆడుతుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఇక తెలిసిందేగా కావ్య పాప స్టేడియంలో ఉంటే కెమెరాలు ఎలాగూ ఆమె చుట్టూరానే తిరుగుతుంటాయి. సంబంధిత వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
![]() |
![]() |