రాజమహేంద్రవరంలో డబుల్ మర్డర్ కేసు కలకలం రేపింది. ప్రియురాలు, ఆమె తల్లిని ప్రియుడే దారుణంగా హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియం సమీపంలోని మసీదు వీధిలో చెందిన అబ్దుల్ మజీద్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మజీద్ మొదటి భార్యకు ముగ్గురు కుమారులు కాగా.. వారందరు రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. మజీద్, రెండో భార్య సాల్మ దంపతులకు సామ్య అలియాస్ సన కుమార్తె.. ఆమె వయసు 16 ఏళ్లు. మూడేళ్ల క్రితం మజీద్ అనారోగ్యంతో చనిపోగా.. అప్పటి నుంచి కుమార్తె సన ఈవెంట్స్‌లో యాంకర్‌గా చేస్తూ తల్లితో కలిసి ఉంటోంది.
సన ఆరు నెలల క్రితం సామర్లకోట దగ్గర ఓ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్తవీధికి చెందిన పిల్లా శివకుమార్ పరిచయం అయ్యాడు. శివకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొద్ది నెలల క్రితం సాల్మ తల్లితో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు.. రూరల్ పరిధిలోని హుకుంపేట పంచాయతీ పరిధిలోని డీబ్లాక్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే మజీద్ మొదటి భార్య కుమారుల్లో చివరివాడు ఉమర్ పిన్ని ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు. అయితే శివకుమార్ సనపై అనుమానం పెంచుకున్నాడు.. ఆమె తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోనులో మాట్లాడుతోందనే గొడవకు దిగేవాడు.
నాలుగు రోజుల క్రితం శివకుమార్ సన ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు.. మళ్లీ శనివారం రాత్రి శివ, సన మధ్య గొడవం జరిగింది. సన సోదరుడు ఉమర్ ఇద్దరికి సర్దిచెప్పి వెళ్లిపోయాడు. ఉమర్ ఆదివారం మధ్యాహ్నం పిన్ని ఇంటికి వచ్చి చూసేసరికి సన, ఆమె తల్లి రక్తపు మడుగులో చనిపోయారు ఉన్నారు. శివకుమార్ ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివకుమార్‌ను కొవ్వూరు రోడ్డు-రైలు వంతెన సమీప ముళ్లపొదల్లో ఉండగా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సనపై అనుమానం పెంచుకుని ఆమె తల్లితో సహా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |