లావా కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘షార్క్’ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ఐఫోన్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఫీచర్లను పరిశీలిస్తే 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్రంట్ 8 mp కెమెరా వెనుక వైపు 50 mp కెమెరా ఇచ్చారు. అలాగే ఇందులో యూనిసోక్ టీ606 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. కాకపోతే ఇది 4జీ ఫోన్. ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ 4/64 GB రూ. 9వేలుగా నిర్ణయించారు.
![]() |
![]() |