ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా ఏఐ క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇస్తోంది. గతేడాది రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ అధినేత, భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా కొన్ని ప్లాన్లకు ఈ స్టోరేజీని ఇప్పుడు అందిస్తున్నారు. దీనికి సంబంధించి.. రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.
"మేము 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తాము" అని ఏజీఎంలో చెప్పారు అంబానీ. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇప్పుడు జియో ఈ ఉచిత క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ స్టోరేజీ నిండిపోయిన వారికి ఇది ఒక మంచి అవకాశం.
జియోలో రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ క్లౌడ్ స్టోరేజీని ఇస్తోంది. తక్కువ మొత్తం రీఛార్జ్ చేసిన వారికి 5 జీబీ డేటా మాత్రమే ఫ్రీ ట్రయల్ రూపంలో లభిస్తుంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ అయినటువంటి.. రూ. 349, రూ. 449, రూ. 649, రూ. 749, రూ. 1549 లలో కూడా క్లౌడ్ స్టోరేజీ కలిపి ఉంది. ఇతర టెలికాం నెట్‌వర్క్ యూజర్లకు కూడా ప్రమోషనల్ స్టోరేజీలో భాగంగా కొంతకాలం పాటు 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందిస్తున్నట్లు జియో క్లౌడ్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
మొదట గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌కి వెళ్ళండి. అక్కడ జియో క్లౌడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ జియో నంబర్‌తో లాగిన్ అవ్వండి. అప్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి మీకు కావాలసిన ఫైళ్లను ఎంచుకోండి. డెస్క్‌టాప్‌లో అయితే జియో క్లౌడ్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ స్టోరేజీ నిండిపోయిన వారు.. జియో అందిస్తున్న క్లౌడ్ స్టోరేజీలోకి లార్జ్ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా స్పేస్ పొందొచ్చు.
జీయో క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్ వివరాలు:
50 జీబీ ఉచిత స్టోరేజ్: జియో వినియోగదారులు 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందే అవకాశం ఉంది.
సురక్షిత డేటా బ్యాకప్: ఫోన్‌లో ఉన్న ఫైళ్లను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకోవచ్చు.
ఎక్కడైనా యాక్సెస్: జీయో క్లౌడ్ ఉన్న డేటాను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి ఎటువంటి డివైస్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఫైల్ షేరింగ్: జియోక్లౌడ్‌లో ఉన్న ఫైళ్లను ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
అదనపు స్టోరేజ్: 50 జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్ అవసరమైన వారికి అదనపు క్లౌడ్ ప్లాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
![]() |
![]() |