భారతీయులకు బంగారం అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది అలంకరణగా చక్కడా ఉపయోగపడుతుంది. గోల్డ్ జువెల్లరీ అనేది మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. ఇక బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా.. పెట్టుబడి సాధనంగా కూడా పనిచేస్తుంది. రోజురోజుకూ విలువ పెరుగుతున్నందున బంగారంపై ఇన్వెస్ట్ చేసి విపరీతంగా సంపాదించేవారు కూడా ఉన్నారు. గత వారం,, దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ఆకర్షణీయంగా మారింది. సంక్షోభ పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా నిలిచింది. దీంతో ఇటువైపు పెట్టుబడులు వెల్లువెత్తగా.. ధరలు కూడా అదే స్థాయిలో ఆకాశాన్నంటాయి.
అయితే ఇప్పుడు ఒక్కసారిగా బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు తోడు.. ఉద్రిక్తతలు కాస్త తగ్గడం.. ట్రంప్ సుంకం భయాలు కాస్త నెమ్మదించడం వంటి వాటి కారణంగా బంగారం విలువ పడిపోతూ వస్తోంది. వరుసగా మూడో సెషన్లో కూడా ఈ మేరకు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు (31.10 గ్రాములు) 3010 డాలర్లకు దిగొచ్చింది. కిందటి రోజు ఇది 3020 డాలర్లపైన ఉండేది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 33 డాలర్ల వద్ద స్థిరంగా కదలాడుతోంది. ఇక డాలర్ పడిపోతుండటం వల్ల రూపాయి విలువ పుంజుకుంటూ వస్తోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే ఈ మారకం విలువ రూ. 85.58 గా ఉంది.
దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు పతనం అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో తాజాగా బంగారం ధర రూ. 150 పడిపోయింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 82,150 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా రూ. 400, రూ. 400 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర కూడా రూ. 160 దిగిరాగా.. 10 గ్రాములు రూ. 89,620 వద్ద ఉంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ పుత్తడి ధరలు పడిపోయాయి. ఇక్కడ 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా తులానిక రూ. 82,300; రూ. 89,770 వద్ద ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కేజీకి రూ. 1.01 లక్షలు పలుకుతుండగా.. హైదరాబాద్ నగరంలో ఇదే రూ. 1.10 లక్షలకు చేరింది.
![]() |
![]() |