ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేప ఆకు శక్తివంతమైన డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. శరీరంలో విషాన్ని తొలగిస్తుంది. అవయవ పనితీరును మెరుగుపరుస్తుంది. వేప ఆకులలో జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. దీని రసం లేదా నూనె వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వేప ఆకులను నమలడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. శరీరం సహజ కాంతి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం వేపాకు తినడం వల్ల కాలేయానికి మేలు చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలు వేపాకు తింటే ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. వేపాకు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మన చర్మాన్ని కాపాడుతుంది. ఇతర అవయవాలకు కూడా మేలు చేస్తుంది. వేపాకును ప్రతిరోజు తీసుకుంటే వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల చర్మం పైన వచ్చే మొటిమలు, మచ్చలు, ఇతర ఇన్ఫెక్షన్లు మాయమవుతాయి. వేపాకుతో ఒత్తిడికి చెక్ ఇక ప్రతిరోజు పరగడుపున వేపాకును తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆందోళనలు నయం చేయడంలో వేపాకు కీలకంగా పనిచేస్తుంది. వేపాకులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మూడు నుంచి నాలుగు వేపాకులను నమిలి తినాలి. వేపాకులను తినలేకుంటే వేపాకు రసం కూడా తీసుకోవచ్చు. వేపాకు పొడిని కూడా నీటిలో కలుపుకుని తాగవచ్చు. అయితే ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. వేపాకును తీసుకునే వారికి ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించినా, వెంటనే దానిని వాడడం మానేయాలి.
![]() |
![]() |