ఎవరైనా మూర్ఛతో పడిపోతే వారికి గాయాలు కాకుండా చూసుకోవాలి.తల కింద కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టి.. తగినంత గాలి ఆడేలా చూడాలి. ఫిట్స్ సమయంలో వచ్చే వాంతిని మింగకుండా ఉండేలా పక్కకు తిప్పి పడుకోబెట్టాలి.బలవంతంగా నీళ్లను తాగించడం, నోట్లోకి నీరు పోయడం ప్రమాదకరమే. మూర్ఛ తగ్గేదాకా ఆ వ్యక్తి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాతే తినడానికి, తాగడానికి ఏమైనా ఇవ్వాలి. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.
![]() |
![]() |