గత ఏడు సెషన్లుగా లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. భారత్ పై టారిఫ్ ల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు కోల్పోయి 77,288కి పడిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 23,486 వద్ద స్థిరపడింది.
![]() |
![]() |