విద్యుత్ రైలును ప్రారంభించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో విశాఖ పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో బుధవారం శతాబ్ది వేడుకలు నిర్వహించారు. విద్యుత్ లోకోషెడ్‌లో త్రివర్ణ పతాకం థీమ్‌తో బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ లోకో (ఇంజన్)ను తీర్చిదిద్దారు. ఈ రైలుకు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ 1925 ఫిబ్రవరి 3న బాంబే విక్టోరియా టెర్మిన్‌స-కుర్లా మధ్య తొలి విద్యుత్ రైలు నడిచిందన్నారు. విద్యుదీకరణతో రైల్వే రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు. ఏడీఆర్‌ఎం శాంతారామ్, సీనియర్ డివిజన్ ఎలక్ర్టికల్ ఇంజనీర్ (ట్రాక్షన్ డిస్ర్టిబ్యూషన్) బి.షణ్ముఖరావు, సీనియర్ డీసీఎం కె.సందీప్, ఎలక్ర్టికల్ శాఖ అధికారులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |