ప్రముఖ జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ చిత్రాల శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. గూగుల్ జెమినీ ఏఐ సహాయంతో వినియోగదారులు తమ వ్యక్తిగత చిత్రాలను హయవో మియాజాకి ఆర్ట్ స్టయిల్లోకి మార్చుకుంటున్నారు. 'స్పిరిటెడ్ అవే', 'ద బోయ్ అండ్ ద హెరాన్', 'ద విండ్ రైజెస్' వంటి చిత్రాలతో స్టూడియో ఘిబ్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాలలోని ప్రత్యేకమైన విజువల్ శైలి, వాటర్‌కలర్ లాంటి నేపథ్యాలు, ఆహ్లాదకరమైన లైటింగ్, ఫాంటసీ అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు, ఎవరైనా సరే గూగుల్ జెమినీని ఉపయోగించి తమ ఫోటోలను ఉచితంగా ఈ శైలిలో మార్చుకోవచ్చు.
గూగుల్ జెమినితో మీ చిత్రాలను ఘిబ్లీ-శైలి యానిమే కళగా మార్చడానికి ఈ సాధారణ స్టెప్-బై-స్టెప్ గైడ్‌ను అనుసరిస్తే చాలు.
1. గూగుల్ జెమిని ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లండి (gemini.google.com) లేదా iOS లేదా Androidలో జెమిని యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. ప్రారంభించడానికి మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
2. అప్‌లోడ్ ఆప్షన్ ను క్లిక్ చేయండి - సాధారణంగా ఒక పేపర్‌క్లిప్ లేదా కెమెరా చిహ్నంతో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం స్పష్టమైన ఫోటోను ఎంచుకోండి. వ్యక్తులు, పెంపుడు జంతువులు లేదా ప్రకృతి దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సరైన ఫలితాలను ఇస్తాయి. హై రిజల్యూషన్ చిత్రాలయితే మరీ మంచింది. ఘిబ్లీ అవుట్ పుట్ ఇంకా బాగా వస్తుంది.
3. టెక్స్ట్ బాక్స్‌లో, వివరణాత్మక సూచనను టైప్ చేయండి: "ఈ ఫోటోను మృదువైన పాస్టెల్ రంగులు, డ్రీమీ బ్యాక్ గ్రౌండ్ తో స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమేగా మార్చండి" అని కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అడిషనల్ కస్టమైజేషన్ కోసం "ప్రశాంతమైన సరస్సు" లేదా "సంధ్యా వెలుగు" వంటి నిర్దిష్ట అంశాలను జోడించండి.
4. మీరు కొత్త సన్నివేశాన్ని సృష్టిస్తుంటే, ఇమేజ్ ఎలా కనిపించాలో వివరాలతో పాటు "స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమే కళను సృష్టించు" అనే ప్రాంప్ట్‌కు మీరు ఆ సన్నివేశాన్ని కూడా గూగుల్ జెమినికి వివరించవచ్చు.
5. మీ ప్రాంప్ట్‌ను పంపగానే, జెమిని కొన్ని క్షణాల్లోనే ప్రాసెస్ చేస్తుంది. ప్రారంభ అవుట్‌పుట్‌కు మార్పులు అవసరమైతే, నిర్దిష్ట సూచనలతో మరోసారి కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వొచ్చు. "మరింత అటవీ ఆకృతిని జోడించండి" లేదా "లైటింగ్‌ను మెరుగుపరచండి" అనే కమాండ్ లు ఇచ్చి రీజనరేట్ చేసుకోవచ్చు.
6. మీ పూర్తయిన చిత్రాన్ని సేవ్ చేయడానికి డెస్క్‌టాప్‌లో కుడి వైపున క్లిక్ చేయండి. మొబైల్ లో అయితే ఎక్కువ సేపు ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది.
![]() |
![]() |