ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పేలవ ప్రదర్శనతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు. టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... గాయం కారణంగా రోహిత్ ఆడటం లేదని ప్రకటించాడు. నిన్నటి మ్యాచ్ కు ముందు ఒక వీడియో వైరల్ అయింది. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ మోకాలిపై బంతి తగిలినట్టు వీడియోలో కనిపించింది. మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే మాట్లాడుతూ... రోహిత్ కు మోకాలి దగ్గర గాయమయిందని చెప్పారు. రోహిత్ కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.వరుసగా విఫలమవుతున్న రోహిత్ ను మూడో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారు. నాలుగో మ్యాచ్ లో పక్కన పెట్టేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. రోహిత్ కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇస్తామని జయవర్దనే చెప్పడంతో... తదుపరి మ్యాచ్ లో కూడా రోహిత్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.
![]() |
![]() |