తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను https://tgcet.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. గురుకులాల్లో సీట్ల భర్తీలో దివ్యాంగులు, అనాథలు, మత్స్యకార కుటుంబాలు, మైనార్టీలు, ఆర్మీ కుటుంబాల పిల్లలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఈడబ్ల్యూఎస్, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలుత ఆయా కేటగిరీల వారీ ఫలితాలు విడుదల చేస్తామని.. మిగతా కేటగిరీల అభ్యర్థుల ఫలితాలు, సీట్ల కేటాయింపు వివరాలు ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించనున్నారు.
![]() |
![]() |