మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతున్న మ్యాచే చివరిదా? అనే ప్రశ్నలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ధోనీ కూడా బరిలోకి దిగాడు. వాస్తవానికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. ధోనీనే ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ గైక్వాడ్ కోలుకోవడంతో అతడే కెప్టెన్‌గా టాస్‌కు వెళ్లాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో కనిపించిన ఓ దృశ్యం ధోనీ రిటైర్మెంట్ పుకార్లకు కారణమైంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు, అతడు భార్య స్టేడియానికి వచ్చారు. ఇందులో ఏముంది? ఇలా చాలా మంది ఫ్యామిలీ వస్తారు కదా? అంటారా! అవును అయితే చాలా మంది విషయంలో ఏమోగానీ.. ధోనీ పేరెంట్స్ ఎప్పుడూ కెమెరా కంట పడరు. మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి రావడం కూడా అరుదు. కానీ ప్రస్తుతం చెపాక్‌కు వీర్దదరూ రావడంతో ధోనీ రిటైర్మెంట్ పలుకుతాడని.. తమ కుమారుడు ఆడే చివరి మ్యాచ్ చూసేందుకే వీరు వచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో.. “ధోని తల్లిదండ్రులు చెపాక్‌లో ఉన్నారు. ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడా? నోనో నేనైతే చేయడు అనుకుంటున్నా” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. “ధోనిని ఉత్సాహపరిచేందుకు అతడి తల్లిదండ్రులు, భార్య చెపాక్ స్టేడియానికి వచ్చారు” అని మరొక యూజర్ కామెంట్ చేశాడు. మరికొందరేమో.. ధోనీ రిటైర్మెంట్ పలికితే తట్టుకోవడం మాత్రం కష్టం బ్రో.. అని పేర్కొంటున్నారు. కాగా మరికొందరైతే.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే.. ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ మొదలెట్టారు. ధోనీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ తమ కెప్టెన్ అని గుర్తు చేసుకుంటున్నారు. కామెంటేటర్లు సైతం ధోనీ తల్లిదండ్రులు.. భారత్ ఆడే మ్యాచ్‌ను కూడా చూసేందుకు వచ్చినట్లు కనిపించలేదని.. కానీ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు రావడానికి ఏదైనా ప్రత్యేకతా ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |