తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. తొలుత ఏప్రిల్ 13వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించి.. అనంతరం ఏప్రిల్ 20వ తేదీకి మార్చారు. ఈస్టర్ పండుగ నేపథ్యంలో పరీక్షను ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు 38,643 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ పరీక్ష తేదీని ఈ మేరకు రెండు సార్లు అధికారులు మార్చడం గమనార్హం. కాగా మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్థులు హాల్‌టికెట్లు, ఫలితాలు వంటి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://telanganams.cgg.gov.in/ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత స్కోర్ ద్వారా 6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయి.. అలాగే.. 7 నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తారు.
![]() |
![]() |