కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు పూజల అనంతరం ఆశీర్వదించారు. జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండటంతో అమ్మవారి ఆశీర్వాదం కోసం వీరు ఆలయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేలా ఆశీర్వదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఈ సీజన్‌ను రాజస్థాన్‌పై భారీ విజయంతో ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత గాడి తప్పింది. హ్యాట్రిక్ ఓటముల పాలైంది. ఎల్ఎస్‌జీపై 5 వికెట్లు, డీసీపై 7 వికెట్లు, చివరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఇలా ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడంపట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు (ఆదివారం) గుజరాత్ టైటాన్స్‌తో సొంత మైదానంలో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |