ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి మ్యాచ్ లోనే విధ్వంసం సృష్టించిన అశ్విని కుమార్...

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 31, 2025, 10:52 PM

2025 ఐపీల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ vs   కోల్‌కతా నైట్ రైడర్స్  తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి ఓ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల అశ్వని కుమార్ మొహాలీకి చెందిన ఆటగాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 4/24 గణాంకాలతో బౌలింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్ విజయానికి బాటలు వేశాడు. తన అద్భుతమైన స్పెల్‌తో తొలి బంతికే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేయడం ద్వారా అశ్వని తన వికెట్ ఖాతాను తెరిచాడు. ఈ వికెట్ తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుకున్న అశ్వని, రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ లను పెవిలియన్‌కు పంపి 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com