ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. రూ. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రంవాల్ పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పరిశీలిస్తారు.సహాయపునరావాస కార్యక్రమాలపైనే ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72 శాతం పూర్తికాగా.. నిర్వాసితులకు రూ. 6వేల కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయపునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులు ఇస్తేనే మీకు ఇస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని విస్మరిస్తుంటుంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వదు.
![]() |
![]() |