తిరుమలలో పవిత్రమైన పాపవినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహంచడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా? లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ.... ఈ వ్యవహారంపై అటవీశాఖ మంత్రి కాషాయాంబరధారి, పవనానందల స్వామి వివరణ ఇవ్వాలి. గత కొంతకాలంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. సనాతనధర్మాన్ని మౌనంతో సాధించాలని ఆయన భావిస్తున్నారని అనుకోవాలా? అటవీశాఖ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆధీనంలోనే ఉంది. తన శాఖ పరిధిలో జరుగుతున్న ఈ ఘటనలపై ఆయన ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? తిరుమలపై ప్రభుత్వం అవకాశం ఇస్తున్నందునే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికే కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందా? అని ప్రశ్నించారు.
![]() |
![]() |