గుడిబండ మండలం కొంకల్లు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మడకశిర చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 50 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేసినట్లు నిర్వహకులు తెలిపారు.
వీరితోపాటు పిఠాపురానికి చెందిన కొందరు యువకులు కూలీ పనుల నిమిత్తం అక్కడికి వచ్చారని, వారూ రక్తదానం చేసినట్లు వివరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
![]() |
![]() |