ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 77,414 వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 23,519 వద్ద స్థిరపడింది.
![]() |
![]() |