ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన xAIకి ‘ఎక్స్’ను 33 బిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని మస్క్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందని తెలిపారు. ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు.2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మస్క్ అనేక మార్పులు చేపట్టారు. సంస్థ పేరును ట్విటర్ నుంచి ‘ఎక్స్’గా మార్చారు. అదేవిధంగా ట్విట్టర్ పిట్ట స్థానంలోకి ‘X’ను చేర్చారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్ విషయంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇక చాట్‌జీపీటీకి పోటీగా గతేడాది మస్క్ ‘ఎక్స్‌ఏఐ’ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు.
![]() |
![]() |