నిన్న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్‌సీబీ తో జరిగిన మ్యాచ్ లో హోం టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అనూహ్యంగా ఓటమి పాలైంది. 50 పరుగుల తేడాతో చెన్నైను బెంగళూరు చిత్తు చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో ఆర్‌సీబీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమిని సీఎస్‌కే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని చెన్నై జట్టు ఎంపిక, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. "దీపక్ హుడా అవుట్‌డేటెడ్ క్రికెటర్. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించడం ఏంటో అర్థం కాలేదు. అసలు ఈ ఇద్దరినీ ఎందుకు ఆడిస్తున్నారో... ఏమో ధోనీ 13వ ఓవర్లోనే రావాల్సి ఉన్నా రాలేదు. 18వ ఓవర్‌లో వచ్చి సిక్సర్, ఫోర్ కొట్టగానే అభిమానులు తలా.. తలా అని సందడి చేశారు. ధోనీ రిటైర్ అయితే మంచిది" అని సదరు ఫ్యాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |