రాగి జావాతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావాతో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. రాగి జావా వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగి జావలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె అలాగు రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. రాగి జావలో ఉండే ఫైబర్ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను.. సంతృప్తిని కలిగిస్తుంది. రాగి జావలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
![]() |
![]() |