విభిన్న సంగీత శైలుల సంగమాన్ని వేడుక చేసే ఐకానిక్ వేదిక కోక్ స్టూడియో భారత్ తన మూడో సీజన్ 'హోలో లోలో' రెండవ ట్రాక్ను ప్రదర్శిస్తోంది. ఇది ఒక ఫాండి (ఏనుగు మావటి) ప్రపంచంలోకి లయబద్ధమైన ప్రయాణం. జానపద, సమకాలీన సంగీతాల కలయిక ద్వారా, కోక్ స్టూడియో భారత్ కాలానికి అతీతమైన సంబంధాన్ని తీసుకువస్తోంది. ఒక అద్భుత దృశ్య అనుభవాన్ని రూపొందిస్తుంది. శంకురాజ్ కోన్వర్, షల్మాలి ఖోల్గాడే గాత్రదానం చేసిన ఈ పాట అస్సాం ప్రాంతీయ సారాన్ని హిందీతో మిళితం చేసి, ఫాండి మరియు అతని ఏనుగు నేస్తం మధ్య ఉన్న లోతైన బంధాన్ని చాటిచెబుతుంది. ఒంటరితనం, ఆకాంక్ష, ప్రకృతి పిలుపును ప్రతిధ్వనిస్తూ, అస్సాంలోని మోరన్ కమ్యూనిటీ యొక్క లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలు, తన జీవితకాల నేస్తం అయిన ఏనుగు కోసం పచ్చిక బయళ్లను వెతుకుతూ నెలల తరబడి దట్టమైన అడవులు, కొండలలో తిరుగుతున్న ఒక ఫాండి కథను చిత్రీకరిస్తాయి. వారు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, అతను తన హృదయాన్ని పాటల్లోకి కుమ్మరిస్తాడు, ఒకప్పుడు లోయలో వేచి ఉన్న జీవి పట్ల ప్రేమ గుసగుసలను పంచుకుంటాడు. టోరాని గ్రామం నుండి వచ్చిన ఈ హృదయ విదారక గాథను హోలో లోలోతో కోక్ స్టూడియో భారత్ తిరిగి అందరి ముందుకు తీసుకువస్తోంది. ఈ కథను ఉత్తేజకరమైన బాణీలు, అద్భుతమైన దృశ్యాలతో నింపుతుంది. తరతరాలుగా వస్తున్న జానపద కథలను ఆధునిక ప్రకృతి దృశ్యంతో కలిపి మిళితం చేయడం ద్వారా, ఈ ట్రాక్ గతాన్ని, వర్తమానాన్ని వారధిగా మార్చి, నేటి ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తూ, శాశ్వత వారసత్వం ఆత్మను కాపాడుతుంది.
"హోలో లోలోకు తిరిగి ప్రాణం పోయడం ఒక గౌరవం" అని శంకురాజ్ కోన్వర్ అన్నారు. ‘‘ప్రాంతీయ సంగీతం ఇప్పుడు ముందంజలో ఉంది మరియు కోక్ స్టూడియో భారత్ భారతదేశ గొప్ప సంప్రదాయాలను స్వీకరించడం ద్వారా దానిని సాధ్యం చేస్తోంది. ఇది అస్సాం చరిత్రకు నివాళి. దేశవ్యాప్తంగా మన మూలాలను, సంగీతాన్ని మోసుకెళ్ళే ప్రాంతీయ కళాకారులకు జాతీయ వేదికను అందించే వేదికలో భాగం కావడం నాకు చాలా సంతో షంగా ఉంది’’ అని అన్నారు.‘‘జానపద సంగీతానికి శాశ్వతమైన ఆత్మ ఉంది. హోలో లోలో అస్సామీ వారసత్వాన్ని సమకాలీన ధ్వనితో అందంగా మిళితం చేస్తుంది. కోక్ స్టూడియో భారత్ జానపద సంగీతం వృద్ధి చెందడమే కాకుండా విస్తృత ప్రేక్ష కులతో ప్రతిధ్వనించే స్థలాన్ని సృష్టిస్తోంది. సంప్రదాయ సంగీతాలకు ఈ రోజు శ్రోతలు కోరుకునే వాటిని అందిస్తూ నే తాజా గుర్తింపును ఇస్తోంది’’ అని షల్మాలి ఖోల్గాడే అన్నారు.
![]() |
![]() |