ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే స్టాక్ మార్కెట్లు చాలా వరకు పతనమయ్యాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టాక.. తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్ పథకాలు కూడా చాలా వరకు ఏడాది వ్యవధిలో అంతలా రాణించలేదు. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. సిప్ పెట్టుబడులపై 20 శాతం కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. దాదాపు 130 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. సిప్ పెట్టుబడిదారులకు రెండంకెల నష్టాన్ని కలిగించాయి.
వీటన్నింటిలో సామ్‌కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గరిష్టంగా 33.56 శాతం నష్టాన్ని నమోదు చేసింది. మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్‌లో నెలవారీ రూ. 10,000 సిప్ పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ. 1.01 లక్షలు అయింది. పెట్టుబడి చూస్తే.. రూ. 1.20 లక్షలుగా ఉంది. క్వాంట్ వాల్యూ ఫండ్, క్వాంట్ యాక్టివ్ ఫండ్స్ వరుసగా 23.94 శాతం, 23.44 శాతం నష్టాల్ని మిగిల్చాయి. ఈ పథకాల్లో నెలవారీ రూ. 10 వేల సిప్ చేస్తే ఇప్పుడు రూ. 1.04 లక్షలు, రూ. 1.05 లక్షలుగా మలిచింది.
సామ్‌కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ దాదాపు 33.56 శాతం మేర నష్టాన్ని ఇచ్చింది. అంటే, ఎవరైతే ఈ ఫండ్‌లో సిప్ ద్వారా డబ్బులు పెట్టారో, వారికి పెట్టిన దానిలో మూడోవంతుకు పైగా నష్టం వచ్చింది.
సామ్‌కో ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ 29.12 శాతం నష్టాన్ని కలిగించింది. దీంట్లో సిప్ పెట్టుబడిపై రూ. 1.01 లక్షలు మాత్రమే వచ్చింది.
క్వాంట్ వాల్యూ ఫండ్, క్వాంట్ యాక్టివ్ ఫండ్.. ఈ రెండూ కూడా వరుసగా 23.94 శాతం, 23.44 శాతం నష్టాల్ని ఇచ్చాయి. వరుసగా ఇక్కడ రూ. 10 వేల సిప్‌ను రూ. 1.04 లక్షలు, రూ. 1.05 లక్షలుగా చేసింది.
శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 23.24 శాతం నష్టాన్ని కలిగించింది. దీంట్లో నెలకు రూ. 10 వేల సిప్ చేసిన వారికి రూ. 1.05 లక్షలు వచ్చాయి. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ 22.58 శాతం నష్టాన్నిచ్చింది.
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, శ్రీరామ్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్.. ఈ రెండు కూడా వరుసగా 22.5 శాతం, 22.42 శాతం నష్టాల్ని ఇచ్చాయి.
ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 21.88 శాతం నష్టం మిగిల్చింది. దీంట్లో నెలకు రూ. 10 వేల సిప్ చేసిన వారికి రూ. 1.06 లక్షలు వచ్చాయి.
ఇలా చాలా ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే, మార్కెట్ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు వస్తాయి. కాబట్టి, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
![]() |
![]() |