అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ)ను గుజరాత్ టైటాన్స్ (జీటీ) 36 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య, గుజరాత్ యువ ఆటగాడు సాయి కిశోర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండేళ్ల కింద ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగి బాహాబాహీకి దిగడం గమనార్హం. 2022, 2023 సీజన్లలో ఇద్దరు జీటీకి ఆడిన విషయం తెలిసిందే. పాండ్య సారథ్యంలోనే సాయి కిశోర్ ఆడాడు.
![]() |
![]() |