భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు షెడ్యూల్ విడుదల చేసింది.
షెడ్యూల్ వివరాలు...
వన్డే సిరీస్
తొలి వన్డే- అక్టోబరు 19 (పెర్త్)
రెండో వన్డే- అక్టోబరు 23 (అడిలైడ్)
మూడో వన్డే- అక్టోబరు 25 (సిడ్నీ)
టీ20 సిరీస్
తొలి టీ20- అక్టోబరు 29 (కాన్ బెర్రా)
రెండో టీ20- అక్టోబరు 31 (మెల్బోర్న్)
మూడో టీ20- నవంబరు 2 (హోబర్ట్)
నాలుగో టీ20- నవంబరు 6 (గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20- నవంబరు 8 (బ్రిస్బేన్)
![]() |
![]() |