డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి, పెట్టుబడిదార్లు పసిడి కొనుగోళ్ల కోసం ఎగబడుతున్నారు.దీంతో, గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు మరోమారు రికార్డ్ స్థాయిలో పెరిగింది, $3175ను చేరింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 3,173 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 930 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 850 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 690 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 1000 పెరిగింది.ఈ రోజు, మన దేశంలో, పన్నులతో కలుపుకుని, 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ (24K) రేటు రూ. 95,000 వద్దకు చేరుకుని నూతన రికార్డ్ (Gold hits all time high) లిఖించింది. ఆ తర్వాత కాస్త చల్లబడింది. ప్రస్తుతం, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 94,200 వద్ద ఉంది & కిలో వెండి రూ. 1.05,000 దగ్గర కదులుతోంది.హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 92,840 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 85,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 69,630 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1.05,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh) (పన్నులు లేకుండా)విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 92,840 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 85,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 69,630 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1.05,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
![]() |
![]() |