2025-26 కొత్త ఆర్ఠిక సంవత్సరం తొలి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు టారిఫ్‌ల భయాలతో మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.
1. ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
2. ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,మారుతీ సుజుకీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిపెంచాయి.
3. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.51శాతం పెరిగి 74.74డాలర్లకు చేరింది.భారత్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉండటంతో ముడి చమురు ధరలు పెరగడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
4. ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలో ఆర్థికమాంద్యం ప్రభావం పెరగనని గోల్ట్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని 20శాతం నుంచి 35శాతానికి పెంచింది. దీంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
![]() |
![]() |