ఓ జంటకు సంతానం కల్గకపోవడంతో ఓ క్షుద్ర పూజారిని కలిశారు. పిల్లలు పుట్టాలంటే కొన్ని క్షుద్ర పూజలు చేసి నరబలి ఇవ్వాలని.. అలా చేస్తే కచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాడు. దీంతో అలాగే చేద్దామని ప్లాన్ చేసి మరీ ఓ వృద్ధుడిని కిడ్నాప్ చేశారు. క్షుద్ర పూజలు చేసి అతడిని నరబలి ఇచ్చారు. ముఖ్యంగా తల, మొండం వేరు చేసి ఆపై మృతదేహాన్ని హోలికా దహనం మంటల్లో వేశారు. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్ ఔరంగాబాద్ జిల్లా గులాబ్ బిఘా గ్రామానిక చెందిన 65 ఏళ్ల యుగల్ యాదవ్ మార్చి 13వ తేదీన అదృశ్యం అయ్యాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పటి నుంచే అతడి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ మూడు, నాలుగు రోజులు వెతికినా లాభం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బంగర్ గ్రామంలోని హోలికా దహన్ కార్యక్రమం బూడిదలో మానవ ఎముకలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకుని మానవ ఎముకలతో పాటు మంటల్లో దొరకిన చెప్పులను గుర్తంచారు. అయితే క్లూస్ టీం ఆధారాలు సేకరించిన తర్వాత డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఈక్రమంలోనే శునకం కాలిన ఎముకలు దొరికిన చోటు నుంచి క్షుద్ర పూజారి రామిశక్ రిక్యాసన్ ఇంటికి వెళ్లింది. అతడు ఇంట్లో లేకపోవడంతో.. అక్కడున్న బంధువు ధర్మేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై తమదైన స్టైల్‌లో విచారించగా అతడు అసలు నిజం చెప్పాడు.
అదే గ్రామానికి చెందిన సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తికి సంతానం కల్గకపోవడంతో.. మంత్రగాడు రామశిష్ రిక్యాసన్‌ను కలిశారని తెలిపాడు. ఈక్రమంలోనే ఓ వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు కల్గుతారని పూజారి చెప్పగా.. యుగువల్ యాదవ్‌ను కిడ్నాప్ చేశారని.. ఆపై నరబలి ఇచ్చి మెండెం, తల వేరు చేసినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత తెగిన మెండాన్ని తీసుకెళ్లి హోలికా దహనం హోలీ మంటల్లో వేసినట్లు వివరించాడు. గతంలో కూడా ఓ యవకుడిని ఇలాగే నరబలి ఇచ్చారని స్పష్టం చేశాడు.
![]() |
![]() |