కొన్ని పార్టీల నాయకత్వం కేవలం ఐదుగురి చేతుల్లోనే ఉంటుందని, వారి నుండే అధ్యక్షుడు వస్తారని, కానీ బీజేపీలో ఒక ప్రక్రియ ఉంటుందని, 12 నుంచి 13 కోట్ల పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో జరుగుతోన్న చర్చలో భాగంగా సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అమిత్ షా మధ్య వాగ్వాదం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.అమిత్ షా స్పందిస్తూ, అఖిలేష్ నవ్వుతూ ఒక విషయం వెల్లడించారని, తాను కూడా నవ్వుతూనే సమాధానం చెబుతానని, కొన్ని పార్టీల నాయకత్వం ఐదుగురి చేతుల్లోనే ఉంటుందని, వారి నుంచి అధ్యక్షుడు వస్తారని కౌంటర్ ఇచ్చారు.ఐదుగురి నుంచే అధ్యక్షుడిని తీసుకుంటారు కాబట్టి మీకు సమయం పట్టదని చురక అంటించారు. మరో పాతికేళ్లు మీరే అధ్యక్షుడిగా కొనసాగుతారని అన్నారు. అందులో మార్పు ఉండదని పేర్కొన్నారు. కోట్లాది మంది నుంచి తాము అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలి కాబట్టి తమకు సమయం పడుతుందని చెప్పారు.
![]() |
![]() |