నమ్మించి మోసం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రయినా ఒక పథకాన్ని ఒక్కసారే ప్రారంభిస్తారు, కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రతినెలా పెన్షన్ల ప్రారంభం అంటూ ప్రచార యావతో వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా పండుటాకుల పట్ల అంత ప్రేమ ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదినెలల్లోనే దుర్మార్గంగా మూడు లక్షల పెన్షన్లను ఎందుకు తొలగించారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.... చంద్రబాబు ఈ పదినెలల్లో ఎన్నికల హామీల్లో ఒక్క పెన్షన్లు మినహా ఏ ఒక్క హమీని అమలు చేయలేదు. దీనిపై ప్రజల్లో రగుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ప్రతినెలా పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వృద్దుల పట్ల ఎంతో మానవత్వంతో వ్యవహరిస్తున్నాను అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పిఛన్లంతే అంటూ కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతుంటే అంతే నిస్సిగ్గుగా ఆయన్ను మోసే ఎల్లో మీడియా దానిని అచ్చేసి ఆనందిస్తోంది. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చాడు. జగన్ సీఎం అయ్యాక పింఛన్లను రూ.3వేలకు పెంచుకుంటూ పోతూ 2019-24 మధ్య 66,34,742 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. అంటే ఈ 27 లక్షల మందిని అయిదేళ్లపాటు చంద్రబాబు మోసం చేసినట్టే కదా. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 3 లక్షల పింఛన్లకు కోత విధించి 63.59 లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందజేస్తున్నారు. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. ఎన్నికల హామీలన్నీ పక్కన పడేసి ఒకేఒక్క పింఛన్ల పథకం అమలు చేస్తూ జగన్ నొక్కిన బటన్లు అన్నింటికీ ఇదే సమానమని చెప్పడం ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడమే అని అన్నారు.
![]() |
![]() |