మాజీ మంత్రి కొడాలి నాని ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన మరో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండనున్నారు. గత వారం రోజులుగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్వ్స్ లో సమస్యలు ఉన్నాయని నిర్ధారించడంతో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఈరోజు ముంబయి ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసింది.
![]() |
![]() |