ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగబాబుకి అభినందనలు తెలిపిన చిరంజీవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 10:34 AM

జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు."ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడు (ఎమ్మెల్సీ)గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు. ఆశీస్సులతో అన్నయ్య, వదిన" అని చిరంజీవి  ఎక్స్‌లో (ట్విట్టర్)లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు నాగబాబుతో తాను, తన అర్ధాంగి కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి జత చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరోవైపు అన్న చిరంజీవి పోస్టుకు నాగబాబు స్పందిస్తూ.. "అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు వదినతో కలిసి కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్నునే ఉపయోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించా" అని నాగబాబు పేర్కొన్నారు.ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అన్నయ్య ఇచ్చిన పెన్నుతో సంతకం చేస్తున్న ఫోటోను నాగబాబు షేర్ చేశారు. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com