తిరుమలలో తరచూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారని, మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయన్నారు. మంత్రి నారా లోకేష్ పీఏ పది నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతోంది? అంటూ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `మంత్రి లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా చేస్తున్నారు. గతంలో నాలుగు వేల లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబు అని ప్రశ్నించారు.
![]() |
![]() |