కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రేమోన్మాది తల్లీకూతుళ్ళపై దారుణంగా దాడి చేసిన ఘటనపై ప్రభుత్వ సీరియస్‌గా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి కారకుడైన వ్యక్తిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.... ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. రోజుకు మహిళలపై దాడులకు సంబంధించి దాదాపు 70 ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గంటకు మూడు, నాలుగు ఘటనలు నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇంకా ప్రభుత్వం దృష్టికి రాని ఘటనలు ఎన్నో. ప్రభుత్వ ఉదాసీనత, మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే భయం లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది తల్లీకూతుళ్ళపై అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి చనిపోగా, యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తల్లీకూళుళ్ళపై దాడి చేసిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి. గతంలో నీరబ్‌శర్మ అనే వ్యక్తి పెదగంట్యాడలో ఒక యువతిపై దాడిచేసి పారిపోతే ఈ రోజుకు అతడిని పట్టుకోలేకపోయారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా పోలీసులు చిత్తశుద్దితో స్పందించడం లేదు. పోలీసుల ఉదాసీనతను చూసి అలుసుగా తీసుకుని దుండుగులు రెచ్చిపోతున్నారు. హొమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే ఇప్పటి వరకు 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికపలైన వేధింపులు జరుగుతున్నాయంటే అంతకన్నా దురదృష్టకరం ఉందా అని ప్రశ్నించారు.
![]() |
![]() |